- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Phone Tapping Case: పోలీసులకు మాజీమంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరిక
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు(Harish Rao)కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీలేదని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పునిచ్చింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి రావాలని కోరడం హాస్యాస్పదం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నేతలను వేధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్ సర్కార్ అడుగులకు మడుగులు ఒత్తుతోంది. పోలీసుల చర్యలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి’ అని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. అంతకుముందు కేటీఆర్ స్పందిస్తూ.. బొగ్గు కుంభకోణం నుండి దృష్టి మళ్లించేందుకే హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు పంపారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ‘డైవర్షన్ పాలిటిక్స్’ను సమర్దంగా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు.






