- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిఖిల్ ‘స్వయంభూ’ వాయిదా.. పవన్ కళ్యాణ్‌కు పోటీగా రాబోతున్నాడా?
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddhartha) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభూ(Swayambhu )

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddhartha) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభూ(Swayambhu ). భరత్ కృష్ణమాచారి (Bharath Krishnamachari)దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం భారతీయ చరిత్ర, పురాణాల నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని అద్భుతమైన విజువల్స్, అబ్బురపరిచే యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తీసుకురాబోతున్నారు. ఇందులో నభా నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రకటించి చాలా రోజులే అవుతున్నప్పటికీ పోస్టర్స్ తప్ప మరే అప్టేడ్ రాలేదు.
ఇక ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నట్లు ఇటీవల నిఖిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడినట్లు గత కొద్ది కాలంగా పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా, నిఖిల్ ‘స్వయంభూ’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటూ పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. మార్చి నెలలో ది ప్యారడైజ్, పెద్ది విడుదల కాబోతున్నాయి కాబట్టి ‘స్వయంభూ’ను ఏప్రిల్ 10న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డేట్‌లో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ విడుదల కానున్నట్లు టాక్. ఇక నిఖిల్, పవన్‌తో పోటీ పడతాడా? లేక మరోసారి రిలీజ్ తేదీని మార్చుకుంటాడా? అనేది ఆసక్తిగా మారింది.
Read More : విశ్వంభర’ నుంచి బిగ్ ట్రీట్.. అలాంటి అప్డేట్‌తో అంచనాలు పెంచే ప్లాన్‌లో మేకర్స్!






