మెగా డాటర్ నిహారికకు మళ్లీ పెళ్లి.. చర్చనీయాంశంగా మారిన ఇన్‌స్టా పోస్ట్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-16 08:10:43  IST  )

మెగా డాటర్ నిహారిక(Niharika)కు పెళ్లి పెద్దగా అచ్చిరాకపోవడంతో కొద్ది రోజులకే విడాకులు తీసుకుని విడిపోయింది.

మెగా డాటర్ నిహారికకు మళ్లీ పెళ్లి.. చర్చనీయాంశంగా మారిన ఇన్‌స్టా పోస్ట్!
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక(Niharika)కు పెళ్లి పెద్దగా అచ్చిరాకపోవడంతో కొద్ది రోజులకే విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత నిర్మాతగా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే నిర్మాతగా.. ‘కమిటీ కుర్రాళ్లు’(Committee Kurrollu) చేయగా.. ఈ మూవీ బాక్సాఫీసు ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆమె నిర్మాతగా జీ స్టూడియోస్ బ్యానర్‌పై రాబోతున్న ప్రాజెక్ట్ ‘రాకాస’. సంగీత్ శోభన్(Sangeeth Shobhan) హీరోగా నటిస్తుండగా.. నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. నిహారిక నిర్మాగతానే.. కాకుండా నటిగానే రాణించాలనే ప్రయత్నాలు చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం హాట్ ఫొటోలు షేర్ చేస్తోంది.

అలాగే తనను ట్రోల్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. దీంతో ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతుందన్న చర్చ మొదలైంది. ఇక ఆ ఫొటోల్లో రాణి కలర్ ఓణి, తెలుపు లంగాతో సంప్రదాయ లుక్‌లో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఈ పోస్ట్‌కు ‘‘గమనించే లోగా.. గమకించే రాగాన.. ఏదో వీణ లోన మోగేనా’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు వావ్, సూపర్‌గా ఉన్నావని కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం మళ్లీ పెళ్లి చేసుకుంటావ్.. నీ బాబు ఎప్పుడు చేస్తాడు? అని అంటున్నారు. మొత్తానికి నిహారిక పోస్ట్‌తో పెళ్లి చర్చలు మొదలయ్యాయి.

Read More..

బాక్సాఫీస్ వద్ద ‘మన శంకర వరప్రసాద్ గారు’దూకుడు.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

Next Story