- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాదె ఇన్నయ్య ఆశ్రమం, ఇంట్లో NIA సోదాలు
కొద్ది రోజుల క్రితం మావోయిస్టులకు మద్దతు ఇస్తూ ప్రజలను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో గాదె ఇన్నయ్య ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: కొద్ది రోజుల క్రితం మావోయిస్టులకు మద్దతు ఇస్తూ ప్రజలను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో గాదె ఇన్నయ్య (Gade Innayya) ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జాఫర్‌గఢ్‌లోని గాదె ఇన్నయ్య మాఇల్లు ఆశ్రమంతో పాటు నివాసంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇన్నయ్యను అరెస్టు చేసిన అధికారులు, ప్రస్తుతం ఆయనను రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగానే ఆశ్రమంలో కీలక ఆధారాల కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు గాను ఇన్నయ్యను 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఎన్ఐఏ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, దీనికి సంబంధించిన తీర్పును ఈనెల 16న వెలువరించనుంది. కోర్టు తీర్పు వెలువడే లోపే అధికారులు ఆశ్రమంలో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.






