- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ న్యూస్.. పునీత్ మరణ వార్త ఆమెకు ఇంకా తెలియదట!
దిశ, వెబ్‌డెస్క్: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్- latest Telugu news

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 46 ఏళ్ల వయసులోనే పునీత్ గుండెపోటుతో మరణించడాన్ని ఆయన అభిమానులు నేటికి నమ్మలేకపోతున్నారు. తన యాక్టింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పునీత్.. ఫ్యాన్స్ గుండెల్లో పవర్ స్టార్‌గా చెరగని ముద్ర వేసుకున్నాడు. పునీత్ చేసిన సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని.. టాలీవుడ్ హీరోలు, అభిమానులు కూడా అతను మరణించినప్పుడు చాలా బాధపడ్డారు. ఇదిలా ఉండగా, పునీత్ మరణించిన విషయం అతడి మేనత్త నాగమ్మకు(90) ఇంకా చెప్పలేదంట కుటుంబ సభ్యులు. దీనికి కారణం ఆమెకు అప్పు అంటే చాలా ఇష్టం.. అంతే కాకుండా ఆమెతో అప్పుకు మంచి అనుబంధం ఉండేదట. దీనితో అతడు మరణించాడని తెలుస్తే ఈ వయస్సులో ఆమె తట్టుకోలేదని.. నేటికి అప్పు మరణించిన వార్త ఆమెకు తెలియకుండా దాచిపెడుతున్నారంట. ఆమె ఎప్పుడైనా అడుగుతే అవుట్ డోర్ షూటింగ్‌కు వెళ్లాడని చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఆమెకు విషయం తెలియకుండా దాయడానికి మరో కారణం.. పునీత్ రెండో అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్‌కు గతంలో గుండెపోటు వచ్చిందని ఆమెకు తెలియడంతో.. ఆమె అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైందట. ఈ భయంతోనే ఆమెకు అప్పు మరణ వార్తను తెలియకుండా సీక్రెట్‌గా ఉంచుతున్నారు.






