- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"ఆస్కార్"లో కొత్త రూల్స్
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ రాబోయే 99వ ఆస్కార్ 2027 అవార్డుల కోసం విప్లవాత్మక మార్పులను ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(AMPAS) రాబోయే 99వ ఆస్కార్ 2027 అవార్డుల కోసం విప్లవాత్మక మార్పులను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు చలనచిత్ర రంగంలో మారుతున్న సాంకేతికత, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇప్పటి వరకు ఒక నటుడు ఒకే కేటగిరీలో ఒక సినిమాకే నామినేట్ అయ్యే అవకాశం ఉండగా, ఇకపై ఒకే నటుడు ఒకటి కంటే ఎక్కువ విభిన్న పర్ఫామెన్స్ తో ఒకే విభాగంలో నామినేషన్లు పొందే వీలు కల్పించారు. అయితే, ఈ ప్రదర్శనలు ఖచ్చితంగా రచయితలు రాసినదై ఉండాలని, నటుల ముందస్తు అనుమతితో కూడిన 'హ్యూమన్ పెర్ఫార్మెన్స్' మాత్రమే అర్హత పొందుతుందని అకాడమీ స్పష్టం చేసింది. AI-జనరేటెడ్ నటనకు, కథలకు ఈ నిర్మయంతో చెక్ పడింది.
అవార్డులపై దర్శకుల పేరు
అంతర్జాతీయ చిత్రాల (Best International Feature Film) విభాగంలో కూడా అకాడమీ చారిత్రాత్మక మార్పులు చేసింది. గతంలో ఒక దేశం నుంచి ఒక సినిమాను మాత్రమే అధికారికంగా పంపే అవకాశం ఉండేది, కానీ ఇకపై కాన్స్, వెనిస్, టొరంటో వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో అగ్ర పురస్కారాలు గెలుచుకున్న సినిమాలు, ఆయా దేశాలు అధికారికంగా నామినేట్ చేయకపోయినా నేరుగా ఆస్కార్ బరిలోకి దిగవచ్చు. అలాగే, ఈ విభాగంలో అవార్డును దేశం పేరుతో కాకుండా నేరుగా దర్శకుడికే అందించాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతమైన దర్శకులకు, ఇండిపెండెంట్ చిత్రాలకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు మెరుగుపడతాయని అకాడమీ భావిస్తోంది.
AI కథలకు నో ఎంట్రీ
అంతేకాదు సాంకేతిక, రచన విభాగాల్లో కూడా AI వినియోగంపై అకాడమీ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. స్క్రీన్ ప్లే విభాగానికి సంబంధించి కథ ఖచ్చితంగా 'హ్యూమన్-ఆథర్డ్' కావాలని నిబంధన విధించింది. AIని ఒక సాధనంగా ఉపయోగించుకోవడానికి అనుమతించినప్పటికీ, సృజనాత్మకమైన ప్రధాన భాగాలు మాత్రం మనిషి మేధస్సు నుండే రావాలని స్పష్టం చేసింది. వీటితో పాటు కాస్టింగ్ డైరెక్టర్ల గుర్తింపు, గవర్నర్స్ అవార్డుల ప్రక్రియలో మార్పులు చేయడం వంటివి 99వ ఆస్కార్ వేడుకలో కొత్తగా చోటుచేసుకున్న మార్పులుగా తెలుస్తోంది. 99వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14, 2027న జరగనుంది.






