కొత్త సిమ్ కార్డ్స్.. నయా మోసాలు

by Muthe.Rajitha |

కొత్త సిమ్‌ కార్డు తీసుకోవాలన్నా, లేదా వేరే నెట్‌వర్క్‌కు పోర్ట్‌ చేయాలన్నా చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కొత్త సిమ్ కార్డ్స్.. నయా మోసాలు
X

దిశ, వెబ్ డెస్క్ : కొత్త సిమ్‌ కార్డు తీసుకోవాలన్నా, లేదా వేరే నెట్‌వర్క్‌కు పోర్ట్‌ చేయాలన్నా డీలర్‌ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లో బస్ని పోలీసులు ఓ సైబర్‌ క్రైమ్ గురించి ఎంక్వైరీ చేస్తుండగా.. మురాద్‌ ఖాన్‌ అనే వెల్డర్‌ పేరుతో ఒక మొబైల్ నెంబర్ నమోదై ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు అతడిని కలిసి విచారించగా.. అసలు తన పేరు మీద ఆ నెంబర్ ఉన్నట్టు తనకు కూడా తెలియదని షాక్ గురయ్యాడు. మరోవైపు ఆ నంబర్‌తో లక్షల రూపాయల సైబర్‌ మోసాలు జరిగినట్టు పోలీసులు దగ్గర వివరాలు ఉన్నాయి.

అయితే అసలు విషయం ఏమిటంటే.. 2024 ఫిబ్రవరిలో నెట్‌వర్క్‌ సరిగా రాక తన పాత సిమ్‌ను పోర్ట్‌ చేసుకున్న సమయంలో డీలర్‌ రెండుసార్లు ఫోటో, ఫింగర్‌ ప్రింట్‌ తీసుకున్నట్టు మురాద్‌ వెల్లడించాడు. ఆ వివరాలతోనే అతడి పేరుతో మరో సిమ్‌ను డీలర్ సైబర్‌ నేరగాళ్లకు విక్రయించాడని పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో సిమ్‌ కార్డు డీలర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు.

దీని వెనుక అమాయకుల బయోమెట్రిక్‌ వివరాలతో సిమ్‌లు తీసుకుని మోసాలు చేస్తున్న పెద్ద ముఠా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనినిబట్టి సిమ్‌ తీసుకునేటప్పుడు ఫింగర్‌ ప్రింట్‌, ఐరిస్‌ స్కాన్‌ మళ్లీ మళ్లీ అడిగితే వెంటనే అనుమానించి, తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story