Sooseki Song:‘పుష్ప-2’ లోని పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన నవ దంపతులు

by Kodari Anjali |   (  Updated:2024-12-17 15:50:57  IST  )

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్(Tollywood famous director Sukumar) దర్శకత్వం వహించిన ‘పుష్ప-2’ (Pushpa 2) బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

Sooseki Song:‘పుష్ప-2’ లోని పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన నవ దంపతులు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్(Tollywood famous director Sukumar) దర్శకత్వం వహించిన ‘పుష్ప-2’ (Pushpa 2) బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు కొల్లగొడుతోంది. డిసెంబరు 5 వ తేదీన విడుదలైన ఈ చిత్రం కేవలం పదకొండు రోజుల్లోనే ఏకంగా 1400 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇక టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Tollywood Star Hero Iconstar Allu Arjun) అండ్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారనడంలో అతిశయోక్తిలేదు. పుష్ప-2 లోని సాంగ్స్ కూడా జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో రష్మిక-బన్నీ ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ (Suseki aggiravva madiri uṇṭaḍe na sami) అనే సాంగ్‌కు వేసిన పాట పుష్ప-2 కు మరింత హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సాంగ్‌కు చాలా మంది రీల్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికన పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే తాజాగా ఈ పాటకు కొత్తగా పెళ్లైన ఓ జంట ఖతర్నాక్ స్టెప్పులేసింది. సేమ్ పుష్పరాజ్(Pushparaj) అండ్ శ్రీవల్లీ(Srivalli) లాగే డ్యాన్స్ చేసి.. నవ దంపతులు ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Read More...

‘పుష్ప-2’పై నటి సంయుక్త ట్వీట్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే?


Next Story