- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేపాల్ ఎన్నికలు 2026: 'జెన్-జె' సునామీ.. క్లీన్ స్వీప్ దిశగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ
నేపాల్ ఎన్నికల్లో బాలెన్ షా(RSP) సునామీ! పాత పార్టీలు కనుమరుగు, యువత ప్రభంజనంతో 110+ సీట్లలో ఆధిక్యం. అధికారం దిశగా 35 ఏళ్ల యువనేత అడుగులు.

దిశ, వెబ్ డెస్క్: నేపాల్‌లో మార్చి 5న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల (General election results)తో దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు చోటు చేసుకుంటోంది. ర్యాపర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా (బాలెన్) నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. గత ఏడాది (సెప్టెంబర్ 2025)లో దేశాన్ని కుదిపేసిన అవినీతి వ్యతిరేక 'జెన్-జె' (యువత) ఉద్యమం తర్వాత జరిగిన ఈ ముందస్తు ఎన్నికల్లో పాత రాజకీయ శక్తులన్నీ కనుమరుగవుతున్నాయి. మొత్తం 165 ప్రత్యక్ష స్థానాల్లో RSP దాదాపు 110 కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా, మాజీ ప్రధాని కె.పి. శర్మ ఓలీ తన పట్టున్న ఝాపా-5 నియోజకవర్గంలో బాలేంద్ర షా చేతిలో భారీ ఓటమిని ఎదుర్కోవాల్సి రావడం ఇక్కడి మార్పుకు నిదర్శనంగా నిలుస్తుంది.
దశాబ్దాలుగా నేపాల్‌ను ఏలుతున్న నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్-యూఎంఎల్ వంటి పార్టీలు కేవలం పదుల సంఖ్యలో స్థానాలకే పరిమితమవుతున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం, RSP సులభంగా 138 సీట్ల మెజారిటీ మార్కును దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే జరిగితే, నేపాల్ చరిత్రలో గత 27 ఏళ్ల తర్వాత ఒకే పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ దక్కడం ఇదే తొలిసారి అవుతుంది. 35 ఏళ్ల వయస్సులోనే బాలేంద్ర షా నేపాల్‌కు అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల తీర్పుతో నేపాల్‌లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని, అభివృద్ధి పథంలో దేశం ముందుకు సాగుతుందని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు. కాగా ఈ ఎన్నికలు బాలెట్ పేపర్లతో జరగడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యం అవుతుంది. దీంతో తుది ఫలితాలు ఈ రోజు సాయంత్రానికి, లేదా రేపు ఉదయానికి విడుదల కావచ్చు.






