- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చౌటుప్పల్ ప్రభుత్వ పాఠశాల నిర్లక్ష్యం బట్టబయలు
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంఈఓ కార్యాలయ ఆవరణలో ఉన్న ప్రభుత్వ పాఠశాల గేటుకు వేసిన తాళాన్ని సకాలంలో తీయకపోవడంతో విద్యార్థులు రోడ్డుపైనే నిరీక్షించాల్సిన దుస్థితి సోమవారం చోటు చేసుకుంది.

దిశ, చౌటుప్పల్ టౌన్ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంఈఓ కార్యాలయ ఆవరణలో ఉన్న ప్రభుత్వ పాఠశాల గేటుకు వేసిన తాళాన్ని సకాలంలో తీయకపోవడంతో విద్యార్థులు రోడ్డుపైనే నిరీక్షించాల్సిన దుస్థితి సోమవారం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాల బయట ప్రధాన రహదారిపై వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల గేటు సమయానికి తెరవకపోవడంతో చిన్నారులు రోడ్డుపైనే నిలబడి, వాహనాల రాకపోకల మధ్య కొంతసేపు భయాందోళనలకు గురయ్యారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు రోడ్డుపైనే నిరీక్షించాల్సి వచ్చింది. పాఠశాలను సకాలంలో తెరవలేదని తెలుసుకున్న మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్‌వీ అధ్యక్షుడు నలపరాజు రమేష్ తదితరులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలను సమయానికి తెరవకుండా విద్యార్థులను రోడ్డుపై నిరీక్షింపజేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల పై ఫిర్యాదు చేసేందుకు పలుమార్లు ఎంఈఓ కార్యాలయానికి వెళ్లినా సంబంధిత అధికారి అందుబాటులో ఉండటం లేదని ఆయన ఆరోపించారు. అదే కార్యాలయ ఆవరణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే సమయపాలన లేకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ ఘటన పై జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యంతో పాటు సంబంధిత ఎంఈఓ పై సమగ్ర విచారణ నిర్వహించి, నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నలపరాజు రమేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌వీ మునుగోడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఒంటెద్దు లింగస్వామి, నాయకులు నోముల సుకుమార్ రెడ్డి, గంగాదేవి శివ, ఉదారి రాకేష్, ఎండీ అత్తు తదితరులు పాల్గొన్నారు.






