Draupadi Murmu: జులై 12న హైదరాబాద్‌‌కు ద్రౌబది ముర్ము

by Dishanational2 |
NDAs Presidential Candidate Draupadi Murmu Visits Hyderabad On July 12
X

దిశ, వెబ్‌డెస్క్ : NDA's Presidential Candidate Draupadi Murmu Visits Hyderabad On July 12| భారత తదుపరి రాష్ట్రపతి ఎన్నికల రేసులో ఉన్న ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ము తన ప్రచారాన్ని కొసాగిస్తున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ మద్దతు కూడగడుతున్న ఆమె.. జులై 12న తెలంగాణకు రానున్నారు. మంగళవారం ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు రానున్న ద్రౌపది ముర్ముకు ఘనం స్వాగతం పలికేలా బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కలవనున్నారు. అలాగే తెలంగాణకు చెందిన పలువురు మేధావులతో సదస్సులో ఆమె పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇటీవల తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆయన పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించింది. జలవిహార్ లో సభను ఏర్పాటు చేసి బీజేపీ విధానాలపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతుండగా యశ్వంత్ సిన్హా పర్యటన పేరుతో టీఆర్ఎస్ హడావుడి చేసింది.

Next Story