Draupadi Murmu: సోనియా, మమతకు NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఫోన్

by GSrikanth |   (  Updated:2022-06-24 10:04:53  IST  )

NDA's Presidential Candidate Draupadi Murmu calls Sonia Gandhi, Mamata banerjee, seeking support| ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రతిపక్ష నేతలకు ఫోన్ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లకు ఫోన్ చేసి తనకు మద్దతివ్వాలని కోరారు

NDAs Presidential Candidate Draupadi Murmu calls Sonia Gandhi, Mamata banerjee and Sharad Pawar, seeking support
X

దిశ, వెబ్‌డెస్క్: NDA's Presidential Candidate Draupadi Murmu calls Sonia Gandhi, Mamata banerjee, seeking support| ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రతిపక్ష నేతలకు ఫోన్ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లకు ఫోన్ చేసి తనకు మద్దతివ్వాలని కోరారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాతో పాటు తదితరులు ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒడిశా సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్ము విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై పోటీ చేశారు. జార్ఖండ్ మాజీ గవర్నర్‌కు నవీన్ పట్నాయక్‌తో పాటు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వంటి పార్టీలు మద్దతు ఇవ్వడంతో NDA అభ్యర్థి సునాయాసంగా విజయం సాధించనున్నట్లు తెలుస్తోంది.

Next Story