జట్టులో కోహ్లీ, రోహిత్.. టాస్ గెలిచిన భారత్

by Malleboina Mahesh |

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి నుంచి మూడు మ్యాచుల వన్డే సిరీస్ ప్రారంభం అయింది.

జట్టులో కోహ్లీ, రోహిత్.. టాస్ గెలిచిన భారత్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి నుంచి మూడు మ్యాచుల వన్డే సిరీస్ ప్రారంభం అయింది. ఇందులో భాగంగా వడోదర వేదికగా జరుగుతున్న మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచులో భారత స్టార్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. భారత సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచులో భారీ విజయం సాధించాలని టీమ్ ఇండియా చూస్తుంది. అలాగే భారత్ ను ఓడించి సిరీస్ కైవసం చేసుకొవాలని న్యూజిలాండ్ జట్టు కన్నేసింది. ఈ క్రమంలో నేటి మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠ గా కొనసాగే అవకాశం ఉంది.

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్

భారత్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

Next Story