- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంధన సంక్షోభం.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిన నయారా
దేశవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొనగా.. ప్రయివేట్ రంగ సంస్థ నయారా ఎనర్జీస్ పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచుతూ సామాన్యునికి షాక్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం దేశీయ చమురు మార్కెట్‌లో నెలకొన్న పరిణామాలు వాహనదారులకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెట్రోల్ కోసం బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారులు క్యూ కడుతుండగా.. ప్రయివేట్ రంగ సంస్థ అయిన నయారా ఎనర్జీస్ పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచింది. రష్యాకు చెందిన ప్రముఖ చమురు సంస్థ 'రాస్‌నెఫ్ట్' భాగస్వామ్యం కలిగిన నయారా ఎనర్జీ.. లీటరు పెట్రోల్‌పై దాదాపు రూ. 5, డీజిల్‌పై రూ. 3 వరకు పెంచి సామాన్యుడికి షాక్ ఇచ్చింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు అస్థిరంగా ఉండటంతోపాటు సప్లై చైన్ లో ఏర్పడిన అంతరాయాల కారణంగా ఇంధన ధరలు పెంచుతున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 7,000 అవుట్‌లెట్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ.. పెరిగిన ధరలను ఇప్పటికే అమలులోకి తెచ్చింది.
వివిధ రాష్ట్రాలు విధించే వ్యాట్ (VAT) ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఈ పెంపు గరిష్టంగా లీటరుకు రూ. 5.30 వరకు చేరనుంది. మరోవైపు దేశంలో 90 శాతానికి పైగా మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలైన IOCL, BPCL, HPCL సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను ప్రస్తుతానికి స్థిరంగా ఉంచడం వాహనదారులకు పెద్ద ఊరటనిస్తోంది. కాని ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను లీటరుకు ఏకంగా రూ. 22 మేర పెంచడం మిగతా పరిశ్రమలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక మరో ప్రముఖ ప్రైవేటు సంస్థ రిలయన్స్-బీపీ మాత్రం యథాతథంగా పాత ధరలనే కొనసాగిస్తోంది.






