మాసిన గడ్డం, మందు బాటిళ్లతో దర్శనమిచ్చిన స్టార్ హీరో..

by Disha Web Desk 17 |
మాసిన గడ్డం, మందు బాటిళ్లతో దర్శనమిచ్చిన స్టార్ హీరో..
X

దిశ, సినిమా: 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో మంచి హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని.. తొందరలోనే 'దసరా'తో అలరించనున్నాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా.. మేకర్స్ తాజాగా నాని ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రంలో ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్న హీరో.. భగభగ మండే అగ్నిలో చేతులు పెట్టి తన కోపాన్ని ప్రదర్శిస్తున్నట్లు చూపించారు. ఈ క్రమంలో తనవెంటే నడుస్తున్న గ్యాంగ్‌ను పోస్టర్‌లో చూడొచ్చు. అలాగే తెలంగాణ యాసలో మాట్లాడే నాని మాసిన గడ్డం, లుంగీ, మెడలో దండ, నడుముకు 90ml లిక్కర్ సీసాలతో దర్శనమివ్వడం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇక ఈ మూవీలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.


Next Story

Most Viewed