- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నమ్మశక్యం కాని రికార్డు.. నిమిషానికి 89 సార్లు కడుపు కండరాలను తిప్పి గిన్నిస్ రికార్డు
ప్రఖ్యాత బెల్లీ డ్యాన్సర్ ఎవరికి సాధ్యం కాని ఫీట్ తో గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రఖ్యాత బెల్లీ డ్యాన్సర్ ఎవరికి సాధ్యం కాని ఫీట్ తో గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన ఆమె ఎన్నో సంవత్సరాలుగా బెల్లీ డ్యాన్సర్ గా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆమె తన శరీరానికి ఉన్న అపరిమితమైన సామర్థ్యాన్ని చాటి చెబుతూ అరుదైన గిన్నిస్ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. కేవలం ఒక్క నిమిషం వ్యవధిలో అత్యధికంగా 89 'లేటరల్ అబ్డామినల్ మజిల్ రోల్స్' (Lateral Abdominal Muscle Rolls) చేసి ఆమె ప్రపంచాన్ని విస్మయానికి గురి చేశారు. ఇటలీలోని మిలన్‌లో జరిగిన 'లో షో డీ రికార్డ్' (Lo Show Dei Record) వేదికపై ఈ అద్భుతమైన ఫీట్ ఆవిష్కృతమైంది.
సాధారణంగా బెల్లీ డ్యాన్స్‌లో కడుపు కండరాలను అలల మాదిరిగా తిప్పడం (Abdominal Rolling) అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. దీనిని యోగాలోని 'నౌలి క్రియ'తో పోలుస్తారు. అయితే నటాషా దీనిని ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. శ్వాసను బిగబట్టి (Apnea), అత్యంత వేగంగా తన కడుపు కండరాలను ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు లయబద్ధంగా కదిలిస్తూ ఆమె ఈ రికార్డును సాధించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిబంధనల ప్రకారం, ప్రతి 'రోల్' స్పష్టంగా కనబడాలి. నటాషా చేసిన 89 రోల్స్ అత్యంత కచ్చితత్వంతో ఉండటంతో న్యాయనిర్ణేతలు ఆమెను విజేతగా ప్రకటించారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ప్రస్తుతం నటాషా గిన్నిస్ రికార్డు సాధించిన ఫీట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోతో ఆమె తన కండరాలను వేగంగా కదిలిస్తున్నట్లు ఆ వీడియోలు సోషల్ స్పష్టంగా కనిపించింది. ఆ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది. చాలామంది నెటిజన్లు ఆమె శరీరం రబ్బరులా ఉందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇది ఏదైనా కెమెరా ట్రిక్కా అని సందేహించినా, గిన్నిస్ అధికారుల సమక్షంలో ఆమె ప్రత్యక్షంగా ఈ ఘనత సాధించి అందరి నోరు మూయించారు. నటాషా సాధించిన ఈ విజయం కేవలం నృత్యకారులకే కాకుండా, ఫిట్‌నెస్ ప్రేమికులకు, యోగా సాధకులకు కూడా ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది. కఠినమైన సాధన, ఏకాగ్రత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని ఆమె ఈ రికార్డు ద్వారా నిరూపించారు.






