నాసా చంద్రమండల యాత్ర వాయిదా

by Muthe.Rajitha |

నాసా చేపట్టిన చంద్రమండల యాత్ర అర్టెమిస్-2 మిషన్ వాయిదా పడింది.

నాసా చంద్రమండల యాత్ర వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : నాసా చేపట్టిన చంద్రమండల యాత్ర అర్టెమిస్-2 మిషన్ వాయిదా పడింది. వాతావరణ కారణాల వల్ల కొద్దిగా ఆలస్యమైంది. ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం వద్ద వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ యాత్రను రెండురోజులు వాయిదా వేసింది. దీంతో ఆర్టెమిస్-2 మిషన్ ఫిబ్రవరి 8న జరిగే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. ఈ మిషన్ కోసం ఉపయోగిస్తున్న 98 మీటర్ల పొడవైన స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్‌కు జరగాల్సిన ఇంధన నింపే ప్రక్రియను కూడా విపరీతమైన చలి, ప్రతికూల వాతావరణం వలన తాత్కాలికంగా నిలిపివేశారు.

పరిస్థితులు అనుకూలిస్తే ఈ ప్రక్రియ సోమవారం నిర్వహించే అవకాశం ఉంది. ఈ మిషన్ కు నాసాకు ఫిబ్రవరిలో కేవలం మూడు రోజులు మాత్రమే అవకాశం ఉండగా.. అవి మిస్ అయితే మిషన్ మార్చికి వాయిదా పడే పరిస్థితి ఉంది. కాగా ఈ మిషన్‌లో పాల్గొనబోయే నలుగురు వ్యోమగాములు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. అర్టెమిస్-2 మిషన్‌లో వ్యోమగాములు సుమారు 10 రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించి చంద్రుడి చుట్టూ తిరిగి వస్తారని, వారు చంద్రునిపై దిగరని నాసా స్పష్టం చేసింది.

అయితే ఈ ప్రక్రియ 2027లో వ్యోమగాములను చంద్రుడి ఉపరితలంపై దించేందుకు ముందస్తు ప్రయోగంలా ఉపయోగపడనుంది. 1972 తర్వాత నాసా చంద్రుని మీదికి మానవసహిత యాత్ర చేపట్టడం ఇదే కావడం గమనార్హం.

Next Story