- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాసా చంద్రుని యాత్రకు బ్రేక్.. ఇప్పట్లో లేనట్టేనా?
నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాత్ర ఆర్టెమిస్-2 మరోసారి వాయిదా పడింది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా చేపట్టిన చంద్రయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. మనుషులతో చంద్రుని చుట్టూ ప్రయాణించాల్సిన నాసాకు చెందిన ఆర్టెమిస్ -2 (Artemis II) మిషన్ మార్చి లాంచ్ విండోను పూర్తిగా రద్దు చేసినట్లు నాసా ప్రకటించింది. ఈ మిషన్‌లో ఉపయోగిస్తున్న శక్తివంతమైన SLS (Space Launch System) రాకెట్ అప్పర్ స్టేజ్‌లో హీలియం ప్రవాహం (helium flow)లో సమస్య తలెత్తింది. హీలియం గ్యాస్ రాకెట్ ఇంజిన్లను ప్రెషరైజ్ చేయడానికి, ఫ్యూయల్ ట్యాంకులను శుభ్రం చేయడానికి అత్యంత కీలకం.
SLS లో "interrupted flow" కనిపించడంతో సాంకేతిక బృందం ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. రాకెట్‌ను లాంచ్ ప్యాడ్ నుంచి వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్ (VAB)కి తిరిగి తరలించే ఏర్పాట్లు వేగంగా చేపట్టారు. ఈ పరిణామంతో మార్చి 6 సహా మొత్తం మార్చి విండోలో ఎటువంటి లాంచ్ ఉండదని స్పష్టమైంది. ఇక ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే లాంచ్ విండోను లక్ష్యంగా పెట్టుకుని పనులు కొనసాగిస్తున్నట్లు నాసా అధికారిక బ్లాగ్‌లో తెలిపింది.
ఈ ఆలస్యానికి ప్రధాన కారణం సాంకేతిక సమస్యే అని తెలుస్తోంది. ఫిబ్రవరి 19న నిర్వహించిన “వెట్ డ్రెస్ రిహార్సల్” (ఇంధన పరీక్ష) విజయవంతంగా పూర్తయినా, ఆ తర్వాత హీలియం సిస్టమ్‌లో లోపం బయటపడింది. ఇంజినీర్లు సమగ్ర డేటాను పరిశీలించి, రిపేర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. రాకెట్‌ను VABలో పూర్తి స్థాయి తనిఖీలు చేసి సమస్యను పరిష్కరించిన తర్వాతే మళ్లీ లాంచ్ ప్యాడ్‌కు తీసుకెళ్తారు.
Artemis II అనేది Artemis I తరువాత మనుషులతో చంద్రుని చుట్టూ తిరిగే తొలి మిషన్ కావడంతో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది నాసా. అయితే ఈ ఆలస్యం ప్రభావం ఆర్టెమిస్-3 (చంద్రునిపై మానవ ల్యాండింగ్) షెడ్యూల్‌పైనా పడే అవకాశముంది. కాగా కొలంబియా ప్రమాదం తర్వాత అంతరిక్ష ప్రయాణాల్లో నాసా సేఫ్టీకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నట్టు తెలుస్తోంది.






