Hero Nani: టౌన్ మొత్తం కబ్జా చేసిన నాని మూవీ మేకర్స్.. ఆ ఊరోళ్లకే దొరకడం లేదుగా..??

by Dishafeatures2 |
Hero Nani: టౌన్ మొత్తం కబ్జా చేసిన నాని మూవీ మేకర్స్.. ఆ ఊరోళ్లకే దొరకడం లేదుగా..??
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'దసరా' సినిమాతో మరో భారీ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. డీగ్లామ్ పాత్రలో పక్కా మాస్ లుక్స్ ఇప్పటికే ఫ్యాన్స్‌ను అదరగొట్టేశాడు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. నాని ప్రస్తుతం దాదాపు 500 మందితో కలిసి షూటింగ్ చేస్తున్నాడట. వారిలో ఎక్కువశాతం డ్యాన్సర్ కాగా మిగతి వారు జూనియర్ ఆర్టిస్ట్‌లట. ఓ పాట కోసమే ఈ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారట. గోదావరిఖని‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. దీంతో మూవీ మేకర్స్ 500 మందికి బస కల్పించేందుకు నానా తిప్పలు పడుతున్నారట. ఇప్పటికే ప్రభుత్వ వసతి గృహాలు, హోటళ్లతో సహా ఫంక్షన్ హాళ్లను సైతం బుక్ చేసేసుకున్నారట.

దీంతో అక్కడి వారికే తమ ఇళ్లలోని పెళ్లిల్లకు, ఫంక్షన్‌లకు ఫంక్షన్ హాళ్లు కరువయ్యయని టాక్ నడుస్తోంది. అయితే అంత చిన్న టౌన్‌లో అంత భారీ సెట్, యాక్టర్స్ నెవ్వర్ బిఫోర్ అనేలాంటి పాట చిత్రీకరించడం అంటే పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. దానిని నాని మేకర్స్ విజయవంతంగా పూర్తి చేసేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గోదావరిఖనిని నాని కబ్జా చేసేశాడంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed