సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. కాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

by Kema Shiva Kumar |

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది.

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. కాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్, అల్లు అర్జున్ (Allu Arjun) ఇవాళ హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు (Nampally Court)కు వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర తొక్కిసలాట కేసు (Stampede Case)లో ఆయన కోర్టు ముందుకు రానుండటంతో అటు టాలీవుడ్ వర్గాల్లో.. ఇటు అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు A11 నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే.

కాగా, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసును విచారిస్తున్న నాంపల్లి కోర్టు.. 3 రోజుల క్రితమే అల్లు అర్జున్‌కు అధికారికంగా నోటీసులు జారీ చేసింది. అయితే, ఆయన విచారణకు ఖచ్చితంగా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. ప్రస్తుతం తాను ముంబైలో ఓ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నానని, వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. కానీ, ఆ అభ్యర్థనను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణకు వర్చువల్ హాజరు కుదరదని, నిందితుడిగా ఉన్న హీరో కచ్చితంగా వ్యక్తిగతంగానే కోర్టుకు హాజరుకావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.

Next Story