'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే?

by Pulgam srinivas |

'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ను జూన్ 23న సాయంత్రం 6 గంటలకు శిల్పకళా వేదికలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' సినిమా జూన్ 4న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన తేదీ, వేదికను ప్రకటిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజాగా చిత్ర యూనిట్, ఈ సక్సెస్ ఈవెంట్‌ను జూన్ 23న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమానికి కేవలం చిత్ర బృందం మాత్రమే హాజరవుతుందా? లేక ప్రత్యేక అతిథి కూడా పాల్గొంటారా? అనే అంశం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.




Next Story