- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియదర్శి – నాగదుర్గ కాంబో మూవీకి సుకుమార్ బెస్ట్ విషెస్
ప్రియదర్శి, నాగదుర్గ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి అంతా సిద్ధం.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్, నిర్మాత బన్నీ వాసు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ కొత్త చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో ప్రియదర్శి హీరోగా నటించనుండగా, ప్రముఖ ఫోక్ డాన్సర్ నాగదుర్గ హీరోయిన్‌గా కనిపించనుంది. తెలంగాణ నేపథ్యంతో కూడిన ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్‌కు సుకుమార్ తన ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలిపారు.
సుకుమార్ నిర్మించిన చిత్రాలు సాధారణంగా మంచి కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. అలాగే బన్నీ వాసు నిర్మించిన అనేక చిత్రాలు కూడా విజయాలను అందుకున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించనుండగా, మరికొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.






