- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: నాంపల్లి ఫర్నిచర్ షాపు ఓనర్ అరెస్ట్
హైదరాబాద్‌లోని నాంపల్లి ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నాంపల్లి ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఫర్నీచర్ షాపు ఓనర్ సతీష్ బచా(Furniture Shop Owner Arrested)ను ఆదివారం అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించకుండా సెల్లార్‌లో వ్యాపారం చేస్తుండటంతో కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అగ్నిమాపక నిబంధనలు, భద్రతా ప్రమాణాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రాథమిక విచారణలో షాపు యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తేలిందని, సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
READ MORE ....






