- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏ అమ్మాయిని తెచ్చుకున్నా ఇబ్బంది లేదు.. స్టార్ హీరో ఫాదర్
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లిపై ఇటీవల భారీ స్థాయిలో రూమర్స్ పుట్టుకొస్తున్నాయి.. Latest Telugu News..

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లిపై ఇటీవల భారీ స్థాయిలో రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠితో వరుణ్ ప్రేమలో ఉన్నాడని, తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ వార్తలపై ఇటీవల స్పందిచిన లావణ్య ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా నాగబాబు వరుణ్ పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ఓ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. 'వరుణ్‌కి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. మంచి సంబంధం ఉంటే ఎవరైనా మమ్మల్ని సంప్రదించొచ్చు. ఒకవేళ అతడు ఎవరినైనా ప్రేమించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అతనికి నచ్చిన అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే ఘనంగా పెళ్లి చేస్తాం' అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై చర్చ మొదలుపెట్టిన నెటిజన్లు.. తొందరలోనే వరుణ్ పెళ్లిపీఠలెక్కబోతున్నాడు. కానీ, అది ఆరెంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? అనే క్లారిటీ కావాలంటున్నారు.






