Nani: నాని కోసం 'నాటు నాటు' కొరియోగ్రాఫర్.. 500 మందితో..

by Disha Web |
Nani: నాని కోసం నాటు నాటు కొరియోగ్రాఫర్.. 500 మందితో..
X

దిశ, వెబ్ డెస్క్: నేను లోకల్ సినిమా తర్వాత నాని, కీర్తి సురేశ్ దసరా సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. నేను లోకల్ క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయితే, దసరా తెలంగాణలోని గోదావరిఖనిలోని కోల్ మైన్స్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

కాగా, నాని, కీర్తి సురేశ్‌లపై ఒక పాటను చిత్రీకరిస్తున్న టీమ్ దీనికి 'నాటు నాటు' ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే.. ఏకంగా 500 మంది డ్యాన్సర్లు ఈ పాట షూటింగ్‌లో పాల్గొంటున్నారు. వేసవి వేడి కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సినిమా షూటింగ్‌ను మాత్రం కొనసాగిస్తున్నారు. అయితే 'దసరా' నాని మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్. అంతేకాకుండా ఇది అధిక బడ్జెట్‌తో రూపొందుతోంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత నెలలో విడుదలైన దసరా ఫస్ట్ పోస్టర్ సినిమాపై బార్ హై సెట్ చేసింది.

Next Story

Most Viewed