TG: మున్సిపల్ ఎన్నికలు.. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తి

by Gantepaka Srikanth |

మున్నిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పరిశీలన శనివారం పూర్తయింది. రాష్ట్రంలోని 7మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో 2996 వార్డుల్లో 20,313 మంది 29,694 నామినేషన్లను దాఖలు చేశారు.

TG: మున్సిపల్ ఎన్నికలు.. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్నిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పరిశీలన శనివారం పూర్తయింది. రాష్ట్రంలోని 7మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో 2996 వార్డుల్లో 20,313 మంది 29,694 నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించారు. అయితే పరిశీలనలో తిరస్కరించిన నామినేషన్లలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆదివారం అప్పీల్ చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది. వచ్చిన అప్పీళ్లను సోమవారం ఎన్నికల అధికారులు పరిష్కరించనున్నారు. అనంతరం మంగళవారం నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశముందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఉపసంహరణ పూర్తయిన తర్వాత బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.

మున్సిపల్ కార్పొరేషన్లు= 7

మున్సిపాలిటీలు= 116

మొత్తం వార్డులు= 2,996

నామినేషన్లు వేసిన అభ్యర్థులు= 20,313

నామినేషన్ల సెట్లు= 29,694

పార్టీల వారీగా నామినేషన్లు

ఆప్= 50

బీజేపీ= 5457

బీఎస్పీ= 326

సీపీఎం= 284

కాంగ్రెస్= 10024

మజ్లీస్= 576

బీఆర్ఎస్= 7556

టీడీపీ= 30

వైఎస్ఆర్సీపీ= 1

ఇతర పార్టీలు= 1645

ఇండిపెండెంట్లు= 3745

మొత్తం= 29694

Next Story