Municipal Elections: కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు ఎన్నికల కమిషనర్ ఆదేశం

by Gantepaka Srikanth |

మున్సిపల్ ఎన్నికల అనంతరం ఈనెల 16వ తేదిన జరగబోయే మేయర్, చైర్మెన్ ఎన్నికల్లో పాల్గొనే ఎక్స్ అఫీషియో సభ్యులు(పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు) వివరాలను అందజేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని కోరారు.

Municipal Elections: కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు ఎన్నికల కమిషనర్ ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల అనంతరం ఈనెల 16వ తేదిన జరగబోయే మేయర్, చైర్మెన్ ఎన్నికల్లో పాల్గొనే ఎక్స్ అఫీషియో సభ్యులు(పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు) వివరాలను అందజేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో నమోదుకాబడిన మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ వివరాలను అందజేయాలని ఆదేశించారు. కొత్తగా నమోదు చేసుకోవడానికి సంబంధిత సభ్యుల ద్వారా తేదీ 11.02.2026 నుండి 14.02.2026 వరకు వివరాలు సేకరించాలని మున్సిపల్ కమిషనర్లను కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీడీఎంఏ డాక్టర్ టీకే.శ్రీదేవి, ఎన్నికల పరిశీలకులు మకరంద్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యా నాయక్ పాల్గొన్నారు.

రేపు నామినేషన్ల ఉపసంహరణ..

మున్సిపల్ ఎన్నికల మంగళవారం ఓ ఘట్టం ముగియనుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో 2,996 వార్డులకుగాను 20,313 మంది 29,694 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలనలో 705 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 19,608 నామినేషన్లు అర్హత సాధించాయని అధికారులు వెల్లడించారు. అయితే మంగళవారం మధ్యాహ్నాం 3గంటలకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశముంది. అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల పైనల్ లిస్టు ఎన్నికల అధికారులు వెల్లడించనున్నారు. దీంతోపాటు బరిలో ఉండే ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు.

Next Story