Municipal Elections: మధ్యాహ్నం 1 గంట వరకు 48.54% పోలింగ్ నమోదు

by Malleboina Mahesh |

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభం కాగా మొదటి రెండు గంటలు ఉత్సాహంగా కొనసాగుతోంది.

Municipal Elections: మధ్యాహ్నం 1 గంట వరకు 48.54% పోలింగ్ నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభం కాగా మొదటి రెండు గంటలు ఉత్సాహంగా కొనసాగుతోంది. అనంతరం ఎండ, ఇతర కారణాలతో కాస్త మందగించింది. దీంతో ఉదయం 11 గంటల వరకు 28. 48 శాతం పోలింగ్ నమోదైంది. అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన తాజా గణాంకాల ప్రకా, మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా సగటున 48.54% పోలింగ్ నమోదైంది. ఉదయం మందకొడిగా ప్రారంభమైనప్పటికీ, సమయం గడుస్తున్న కొద్దీ ఓటర్లు భారీగా తరలి వస్తుండటంతో పోలింగ్ శాతం గణనీయంగా పెరుగుతోంది.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా చూస్తే.. మున్సిపాలిటీలలో 51.66% అలాగే కార్పొరేషన్లలో 40.96% పోలింగ్ నమోదైంది. ఓటు వేసేందుకు మున్సిపాలిటీలలో ఓటర్లు ఎక్కువ ఆసక్తి చూపుతుండగా, కార్పొరేషన్ల పరిధిలో పోలింగ్ శాతం కొంత తక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా పుంజుకుంటోంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో (కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్) 1 గంట వరకు అత్యధికంగా 51.99% పోలింగ్ నమోదు కావడం విశేషం.

ఇదిలా ఉంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌లో, కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కొన్ని ప్రాంతాల్లో గుర్తులు తారుమారు కావడం వంటి చిన్నపాటి ఘటనలు మినహా, పోలింగ్ ప్రశాంతం గా జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Next Story