- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దొంగ ఓట్లతోనే కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గెలుపు
కామారెడ్డి 38వ వార్డులో దొంగ ఓట్లతోనే ఇప్ప ఉమారాణి గెలిచారని కాంగ్రెస్ అభ్యర్థిని రంగ మాధవి ఆరోపించారు. రీపోలింగ్ కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు.

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality)లోని 38 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ కేటాయించి పోటీ చేయాలని పురమాయించి తీరా స్వతంత్ర అభ్యర్థి ప్రస్తుత మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి కి సపోర్ట్ చేయాలని కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఓ ముఖ్య నేత సోదరుడు సూచనలు చేశారని అంతేకాకుండా వివిధ గ్రామాల నుంచి దొంగ ఓటర్లను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించారని 38వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రంగ మాధవి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన దొంగ ఓట్ల పోలింగ్ పై వివరించారు. 38వ వార్డులో దొంగ ఓట్లతోనే ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థి, ప్రస్తుతం మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి గెలుపోయిందారని ప్రత్యర్థి అభ్యర్థి రంగ మాధవి ఆరోపించారు.
కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ కేటాయించిందని, స్వతంత్ర అభ్యర్థిగా ఇప్ప ఉమారాణి పోటీ చేశారన్నారు. అయితే తమ పార్టీ ముఖ్య నాయకుడి సోదరుడు అందరికి ఫోన్ చేసి పార్టీ టికెట్ ఇచ్చినా స్వతంత్ర అభ్యర్థే మన అభ్యర్థి అని వారికే ఓటు చేయాలని చెప్పారని ఆరోపించారు. చైర్మన్ ఇప్ప ఉమారాణి స్వగ్రామం రాజంపేట అని, ఆ గ్రామం నుంచి కొంత మందికి 38 వ వార్డులో ఓటు హక్కు కల్పించారన్నారు. రాజంపేట ఉప సర్పంచ్ గా ఉన్న మీర్ ఇమ్రాన్ తో పాటు ఆ గ్రామానికి చెందిన 15 మంది, జంగంపల్లి గ్రామంలో హిందీ పండిత్ గా పని చేస్తున్న అబ్దుల్ గపూర్ దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. అలాగే 40, 37, 39 వార్డులతో పాటు ఇతర వార్డుల నుంచి 38 వ వార్డులో ఓటు వేశారన్నారు.
తమ వార్డులో 5-8-11 నుంచి 5-8-18 నెంబరు గల ఇళ్లపై 50 దొంగ ఓట్లు ఉన్నాయని, హిందువుల ఇళ్లపై ముస్లింల ఓట్లు చేర్చారన్నారు. ఈ విషయమై జనవరి 8 న మున్సిపల్ అధికారులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. 250 డబుల్ ఓట్లు, 66 ఇతర వార్డుల ఓట్లు, 45 కమర్షియల్ శటర్లు, భవనాలపై ఉన్నాయన్నారు. కేటీఆర్ వద్ద పర్సనల్ పీఏగా ఉన్న మాణిక్య మహేష్ చైర్మన్ ఇప్ప ఉమారాణి కజిన్ బ్రదర్ అని, దొంగ ఓట్ల వెనక ఆయన హస్తం కూడా ఉందని ఆరోపించారు. దొంగ ఓట్లను పోలింగ్ రోజు తమ ఏజెంట్లు గుర్తించి అడ్డుకున్నారని, ఓటర్ ఐడితో రావడంతో ఓటరు అతనే కదా అని అధికారులు పట్టించుకోలేదన్నారు.
పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా గ్రూపు తగాదాలతో తాము అన్యాయానికి గురయ్యామని భార్యాభర్తలు కంటతడి పెట్టుకున్నారు. తమకు ఓట్లేసి సహకరించిన వారికి ఫోన్ చేసి అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ ఓట్లతో గెలిచిన ఇప్ప ఉమారాణి ఎన్నికను సవాల్ చేస్తూ రీపోలింగ్ చేయాలని కోర్టును ఆశ్రయించామన్నారు. కౌన్సిలర్ గా ఇప్ప ఉమారాణి ఎన్నికను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. దొంగ ఓట్లు వేసిన వారిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.






