చిన్నారికి పోలీసుల బర్త్‌డే గిఫ్ట్.. వీడియో వైరల్

by Javid Pasha |

చిన్నారికి పోలీసుల బర్త్‌డే గిఫ్ట్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఖాకీ స్టూడియో బ్యాండ్ పోలీసులు ఓ కుర్రాడికి నెవ్వర్ బిఫోర్ అనే గిఫ్ట్ ఇచ్చారు. ప్రతి సండే స్పెషల్‌గా స్ట్రీట్ పర్ఫార్మెన్స్ చేసే ఖాకీ బ్యాండ్ ఈ ఆదివారం ఓ అబ్బాయికి బర్త్‌ డే పాట పాడి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. సండే స్ట్రీట్స్‌లో భాగంగా ఆదివారం ఖాకీ బ్యాంబ్ ముంబై వీధుల్లో కచేరీ చేస్తున్నారు. అందులో అక్కడే పుట్టిన రోజు జరుపుకుంటున్న ఓ అబ్బాయి కోసం పోలీసులు 'హ్యాపీ బర్త్ డే' పాటను వాయించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ చిన్నారి తన పుట్టిన రోజు కేక్ కట్ చేస్తుంటే ఖాకీ బ్యండ్ అతడికి విష్ చేస్తూ 'హ్యాపీ బర్త్ డే' పాటను మోగించారు.

Next Story