ట్రాన్స్‌జెండర్స్‌ కేఫ్.. హార్ట్‌ఫుల్ స్మైల్‌.. ట్రాన్స్ పీపుల్ వెల్‌కమింగ్ స్టైల్

by Disha Web |
ట్రాన్స్‌జెండర్స్‌ కేఫ్.. హార్ట్‌ఫుల్ స్మైల్‌.. ట్రాన్స్ పీపుల్ వెల్‌కమింగ్ స్టైల్
X

దిశ, ఫీచర్స్ : ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ ఫుడ్ బ్లాగింగ్ హ్యాండిల్ ముంబై అంధేరీలోని యూనిక్ కేఫ్‌ను పరిచయం చేసింది. 'నజరియా బద్‌లో.. నజారా బద్‌లేగా' స్లోగన్‌తో రన్ చేయబడుతున్న కేఫ్‌లో అందరూ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన ఉద్యోగులే ఉండటం విశేషం. 'బొంబాయి నజరియా'తో పిలవబడుతున్న కేఫ్‌లో చెఫ్, సర్వర్, రిసెప్షనర్, ఎకౌంటెంట్.. ఇలా అందరూ కూడా ట్రాన్స్ పీపుల్ కాగా కస్టమర్లకు హార్ట్‌ఫుల్ స్మైల్‌తో వెల్‌కమ్ చెప్తున్నారు.

ఇంటి వాతావరణం, ప్రేమతో కూడిన ఈ ప్లేస్ కచ్చితంగా వినియోగదారులకు అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు వెయిట్ చేస్తోంది. 'పింక్ చాయ్' ఇక్కడ స్పెషల్ కాగా.. ముంబై యూనిక్ డిషెస్ అన్నీ అవెలబుల్‌లో ఉన్నాయి. మొత్తానికి ముంబై ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ లెడ్ కేఫ్‌గా ప్రశంసలు అందుకుంటున్న ఈ కేఫ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎల్‌జిబీటీక్యూ కమ్యూనిటీని నమ్మి, ప్రూవ్ చేసుకునేందుకు వారికి అవకాశం ఇచ్చిన సదరు కేఫ్ యజమానిని అభినందిస్తున్నారు. ఈ గొప్ప ఇనిషియేటివ్‌తో ట్రాన్స్‌జెండర్లను తక్కువగా చూసే రోజులు రావాలని, ప్రపంచం మారిపోవాలని కోరుకుంటున్నామని నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed