- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు.. రేషన్ కార్డు జారీ పై ఎమ్మార్వో వివరణ!
మల్దకల్ మండల కేంద్రంలో ఒకే ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న రేషన్ కార్డు జారీ పై సోషల్ మీడియాలో కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలపై స్థానిక ఎమ్మార్వో ఝాన్సీ రాణి వివరణ కోరడమైనది.

దిశ, మల్దకల్: మల్దకల్ మండల కేంద్రంలో ఒకే ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న రేషన్ కార్డు జారీ పై సోషల్ మీడియాలో, కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలపై స్థానిక ఎమ్మార్వో ఝాన్సీరాణి స్పందించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. మల్దకల్ మండల పరిధిలోని సద్దలోనిపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వారికి 2018లో రేషన్ కార్డు మంజూరైంది. కానీ ఆ రేషన్ కార్డు మండలంలోని కుర్తి రావులచెరువు గ్రామంలో మంజూరు అయ్యింది.
2018 నుంచి వారు ఎక్కడ రేషన్ బియ్యం తీసుకోలేదు. అప్పటి నుంచి ఆ రేషన్ కార్డు పెండింగ్‌లోనే ఉందని తెలిపారు. డీఎస్ఓ ఆఫీస్ నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి బియ్యం తీసుకోని వారి యొక్క కార్డులు తొలగిస్తారు. కానీ ఎక్కడనో చిన్న పొరపాటు జరిగి ఆ కార్డు తొలగించలేదు. 2018 నుంచి వారు ఈ కేవైసీ కూడా చేయించలేదు. అందుకనే ఆ కార్డు పనిచేయడం లేదు. ఈ విషయాన్ని మాకు తెలిసిన వెంటనే ఆ గ్రామం యొక్క చౌక ధర దుకాణం డీలర్ నుంచి ఒక లెటర్ తీసుకొని ఆ కార్డుని తొలగించామని ఎమ్మార్వో ఝాన్సీ రాణి తెలిపారు.






