'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ అత్యద్భుతం: ఎంపీ ధర్మపురి అర్వింద్

by Vinod kumar |

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఈ నెల 11న విడుదలైన హిందీ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్' - MP Dharmapuri Arvind comments on The Kashmir Files Movie

mp aravind news
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఈ నెల 11న విడుదలైన హిందీ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్' అత్యద్భుతంగా ఉందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ప్రశంసించారు. తాను కూడా కుటుంబ సభ్యులతో ఈ చిత్రాన్ని చూశానని ఆయన పేర్కొన్నారు. 1980లలో, 1990 జనవరి 19న తర్వాత కశ్మీరీ హిందువుల మీద ఏ రకమైన హింస జరిగిందో ఈ సినిమాలో చూయించారని, నిజాన్ని నిర్భయంగా చూపించిన దర్శక నిర్మాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


మన రాష్ట్రంలో భైంసా పట్టణం కూడా మరో కశ్మీర్ లా కాబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో సుమారు 1500 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసం.. నిజామాబాద్, ఆర్మూర్ , జగిత్యాల పట్టణాల్లో శనివారం మధ్యాహ్నం ప్రత్యేక షోలు వేస్తున్నామని, కార్యకర్తలందరూ ఈ సినిమాను చూడాలని కోరారు.

Next Story