- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్, హరీష్ రావులకు కూడా నమ్మకం లేదు: ఎంపీ చామల
హరీష్ రావు కామెంట్లపైన భువనగిరి ఎమపీ చామల కిరణ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హరీష్ రావు కామెంట్లపైన భువనగిరి ఎమపీ చామల కిరణ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే నోటీసులు ఇస్తున్నారని చెప్పే ప్రయత్నం హరీష్ రావు చేశారు..మీరు పదేళ్లల్లో దోచుకున్నది గమనించిన తర్వాతనే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పరిమితం చేశారన్నారు. గురువారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సింగరేణిపై మీరు లేఖ రాస్తే కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు..కేటీఆర్, హరీష్ రావులు చెప్పే మాటలు బూటకం, అబద్ధం, కాకమ్మ కథలు అని కిషన్ రెడ్డి మాటలతో తేలిపోయింది..హరీష్ రావు నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని ఎంపీ చామల హితవు పలికారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు కేటీఆర్, హరీష్ రావు సహకరించాలని, సిట్ విచారణను తప్పుదోవ పట్టించడానికి నైనీ బ్లాక్ అంశాన్ని కేటీఆర్, హరీష్ రావు ఎత్తుకున్నారని ఆయన ఆరోపించారు. నైనీ బొగ్గు బ్లాకు టెండర్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.. బీఆర్ఎస్ హయాంలో టెండర్ల విషయంలో ఏం జరిగిందో ఆయన చెప్పారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
సైట్ విజిటింగ్ ప్రక్రియ అనేది సాధారణ ప్రక్రియే
టెండర్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకు రద్దు అయ్యాయో కిషన్ రెడ్డి స్పష్టం చేశారని, సైట్ విజిటింగ్ ప్రక్రియ అనేది సాధారణ ప్రక్రియ అని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, నైనీ బొగ్గు బ్లాకుకు 17 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు..ఆ బొగ్గు బ్లాకు సైట్ విజిటింగ్ ర్టిఫికేట్ ఇంకా ఎవరికి ఇవ్వలేదన్నారు. ఇంకా నైనీ బొగ్గు బ్లాకు టెండర్ల ప్రాసెస్ పూర్తి కాలేదు..రేవంత్ రెడ్డి తన బామ్మర్దికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోంది.. వారి హయాంలో ఆ బొగ్గు బ్లాకులో అవకతవకలు జరిగాయని టెండర్లు రద్దు చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్వయానా కేసీఆర్ తన అల్లుడు ఫోన్‌ను ట్యాప్ చేశారు కదా.. మాకు అపొజిషనే లేదని బావా, బామ్మర్దులు విర్రవీగితే ప్రజలు షాక్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసి అధికారంలోకి రావాలన్న కలలు కేటీఆర్, హరీష్ రావు కంటున్నారు మళ్లీ వీళ్ళను ప్రజలు ఆదరిస్తారని కేటీఆర్, హరీష్ రావులకు నమ్మకం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు..అందుకే ఆరు గ్యారెంటీలు ఒకే సారి అమలు చేయడం ఆలస్యం అయిందని ఎంపీ చామల తెలిపారు.






