అక్కడ మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా Motorola

by Harish |

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా మొదటిసారిగా..telugu latest news

అక్కడ మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా Motorola
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా మొదటిసారిగా 2021కి USలో మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది. మోటరోలా 10 శాతానికి పైగా మార్కెట్ వాటాతో, USలో మూడవ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించడం ఇదే మొదటిసారి అని కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ నివేదిక తెలిపింది. మొదటి స్థానంలో Apple, రెండవ స్థానంలో Samsung ఉన్నాయి. LG నిష్క్రమణ ద్వారా మోటరోలా దాని ప్లేస్‌లోకి వచ్చిందని నివేదిక పేర్కొంది. Motorola అమ్మకాలు 2021లో రెండింతలు పెరిగి, సంవత్సరానికి 131 శాతం వృద్ధి చెందాయి. "మోటరోలా US ప్రీపెయిడ్ ఛానెల్‌లలో (Verizon Prepaid, Metro by T-Mobile, Cricket and Boost) మార్కెట్ వాటాను 28 శాతానికి పెంచుకుంది" అని సీనియర్ విశ్లేషకుడు వరుణ్ మిశ్రా తెలిపారు.

Next Story