- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పచ్చి పాలు తాగిన తల్లి... శిశువు మృతి
అమెరికాలో చోటు చేసుకున్న ఓ విషాద ఘటన వైద్యులనే షాక్ కు గురి చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో చోటు చేసుకున్న ఓ విషాద ఘటన వైద్యులనే షాక్ కు గురి చేసింది. ఒక గర్భిణీ మహిళ పచ్చి పాలు(వేడి చేయని పాలు) తాగడం వల్ల ఆమెకు లిస్టీరియా అనే ప్రమాదకరమైన బాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకింది. ఈ ఇన్ఫెక్షన్ ప్రభావంతో ఆమె గర్భంలో ఉన్న శిశువుకు తీవ్ర సమస్యలు వచ్చాయి. ప్రసవం జరిగిన తర్వాత ఆ శిశువు కొద్దిసేపటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పచ్చి పాలు తాగడం ఎంత ప్రమాదకరమో స్పష్టం చేస్తోంది.
అయితే వైద్యుల వివరాల ప్రకారం... పచ్చి పాలలో ఉండే లిస్టీరియా మోనోసైటోజెన్స్ అనే బాక్టీరియా సాధారణ వ్యక్తులకు కొన్నిసార్లు పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, గర్భిణీ మహిళలకు మాత్రం అత్యంత ప్రమాదకరమట. ఈ బాక్టీరియా తల్లి శరీరం ద్వారా నేరుగా గర్భంలోని శిశువుకు చేరి... గర్భస్రావం, ఎర్లీ డెలివరీ, పురిట్లోనే శిశువు మృతి చెందే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. పై ఘటనలో కూడా అదే జరిగింది. తల్లికి పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా, శిశువుపై మాత్రం తీవ్ర ప్రభావం పడి మృత్యువు ఒడికి చేరింది.
ఈ ఘటనపై అమెరికా ఆరోగ్య శాఖ స్పందిస్తూ.. గర్భిణీ మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ పాశ్చరైజ్డ్ లేదా పచ్చి పాలు, పచ్చి పాలతో తయారైన పదార్థాలు తినకూడదని హెచ్చరించింది. పాలను తప్పనిసరిగా బాగా మరిగించి తాగాలని సూచించింది. అలాగే పచ్చి చీజ్, సరిగా ఉడకని ఆహారం వంటి వాటి నుంచి కూడా దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని ఈ విషాద ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది.






