- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రోన్ల దాడులు.. విమానాశ్రయాలు మూసివేత
ఆదివారం సాయంత్రం రష్యా రాజధాని నగరం మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి దిగడం కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : ఆదివారం సాయంత్రం రష్యా రాజధాని మాస్కో నగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఉక్రెయిన్ డ్రోన్లు మాస్కో వైపు దూసుకు రావడంతో నగరంలోని పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ టెలిగ్రామ్ ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌కు చెందిన సుమారు 20 నుంచి 25 డ్రోన్లు రష్యా రాజధాని వైపు దూసుకొచ్చినట్లు తెలిపారు. కనీసం 20 డ్రోన్లను రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విజయవంతంగా ధ్వంసం చేశాయని అన్నారు. అయితే ఈ దాడిలో భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు.
డ్రోన్ల దాడి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రష్యా పౌర విమానయాన సంస్థ రోసావియాత్సియా వెంటనే భద్రతా చర్యలు చేపట్టింది. మాస్కోలోని నాలుగు ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలు.. షెరెమెత్యేవో (SVO), డొమొడెడోవో (DME), వ్నుకోవో (VKO), జూకోవ్‌స్కీ (ZIA) లను తాత్కాలికంగా మూసివేశారు. సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో ప్రారంభమైన ఈ ఆంక్షలు కొద్ది గంటలపాటు కొనసాగాయి. అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కొన్ని విమానాశ్రయాల్లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
ఈ చర్యల ప్రభావంగా 100కిపైగా విమానాలు డైవర్ట్ చేయబడ్డాయి. భద్రతా ప్రోటోకాల్ ప్రకారం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల్లో భాగంగా మాస్కోపై డ్రోన్ దాడుల ప్రయత్నాలు పెరిగాయి. రష్యా S-400, Pantsir వంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఎక్కువగా ఈ డ్రోన్లను అడ్డుకుంటున్నప్పటికీ, రాజధాని నగరంపై ఇలాంటి దాడులు తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయి.






