- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో షమీ విశ్వరూపం.. 8 వికెట్లతో సరికొత్త రికార్డు
రంజీ సెమీస్‌లో మహ్మద్ షమీ విశ్వరూపం. జమ్మూ కాశ్మీర్‌పై 8/90తో కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు. 35 ఏళ్ల వయసులోనూ తన పదును తగ్గలేదని నిరూపిస్తూ టీమిండియా రీ-ఎంట్రీకి సిద్ధం.

దిశ, వెబ్ డెస్క్: భారత పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) గత కొద్ది కాలంగా జట్టులో స్థానం దక్కించుకోలేక పోతున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలు, నిత్యం గాయాలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు (మంగళవారం) నాడు జరిగిన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ పోరులో షమీ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫస్ట్-క్లాస్ గణాంకాలను నమోదు చేశారు. కేవలం 22.1 ఓవర్లలో 90 పరుగులు ఇచ్చి 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. తన పదునైన బంతులతో జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాటర్లను వణికించిన షమీ, కీలకమైన పరాస్ డోగ్రా (58), అబ్దుల్ సమద్ (82) వికెట్లను పడగొట్టి ప్రత్యర్థిని 302 పరుగులకు ఆలౌట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. దీంతో బెంగాల్ జట్టుకు మొదటి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
ప్రస్తుతం 35 ఏళ్ల వయస్సులో ఉన్న షమీ, తన ఫిట్‌నెస్‌పై వస్తున్న విమర్శలకు ఈ ప్రదర్శనతో బలమైన సమాధానం ఇచ్చారు. ఈ రంజీ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో ఆయన మొత్తం 36 వికెట్లు పడగొట్టారు. టీమిండియా 2026లో శ్రీలంక, న్యూజిలాండ్‌లతో జరగబోయే టెస్ట్ సిరీస్‌లకు సిద్ధమవుతున్న తరుణంలో, షమీ ఫామ్ జట్టుకు అదనపు బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. ఆయన అనుభవం, ప్రస్తుత ఫామ్ చూస్తుంటే త్వరలోనే భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయడం ఖాయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.






