ఖమేనీ హత్యపై మోదీ ప్రభుత్వం మౌనం 'నైతిక పతనం': సోనియా గాంధీ ఆగ్రహం

by Malleboina Mahesh |

ఖమేనీ హత్యపై కేంద్రం మౌనం 'బాధ్యతారాహిత్యం' అని సోనియా గాంధీ ఆగ్రహం. విదేశీ విధానంపై ప్రశ్నలు; పార్లమెంట్‌లో చర్చకు డిమాండ్ చేసిన కాంగ్రెస్.

ఖమేనీ హత్యపై మోదీ ప్రభుత్వం మౌనం నైతిక పతనం: సోనియా గాంధీ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన భీకర దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ (Khamenei) ప్రాణాలు కోల్పోయారు. కాగా ఆయన మృతిపై భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. కానీ భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయన మృతిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. దీనిపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) స్పందిస్తూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మౌనాన్ని సోనియా గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. మంగళవారం (మార్చి 3) 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'లో రాసిన వ్యాసంలో ఆమె మోడీ ప్రభుత్వం (Modi Govt)పై విరుచుకుపడ్డారు. ఒక సార్వభౌమ దేశాధినేతను లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ హత్యపై భారతదేశం మౌనం వహించడం తటస్థత కాదని, అది మన విదేశీ విధానం యొక్క విశ్వసనీయతను దెబ్బతీసే 'బాధ్యతా రాహిత్యం' (Abdication) అని ఆమె పేర్కొన్నారు.

అంతర్జాతీయ నియమాలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ దాడులపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల(Budget sessions of Parliament) రెండో విడతలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని, దీనిపై బహిరంగ చర్చ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలు ఇరాన్‌కు అండగా నిలుస్తుంటే, భారతదేశం తన నైతిక బలాన్ని కోల్పోవడం ఆందోళనకరమని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story