కొత్త చట్టాలకు అనుగుణంగా డిజిటల్ వ్యవస్థల ఆధునీకరణ.. రూ. 1771.64 కోట్లు కేటాయింపు

by Malleboina Mahesh |

కొత్త చట్టాల అమలులో భాగంగా కేంద్రం రూ. 1771.64 కోట్లతో డిజిటల్ వ్యవస్థలను (e-Sakshya, e-Summons) అప్‌గ్రేడ్ చేసిందని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.

కొత్త చట్టాలకు అనుగుణంగా డిజిటల్ వ్యవస్థల ఆధునీకరణ.. రూ. 1771.64 కోట్లు కేటాయింపు
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో.. దేశంలో కొత్త న్యాయ సంహితల (Nyaya Sanhitas)అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేర విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) కీలక చర్యలు చేపట్టింది. బీపీఆర్‌డీ (BPR&D), ఎన్‌సీఆర్‌బీ (NCRB), ఎన్‌ఐసీ (NIC) సమన్వయంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఇప్పటికే ఉన్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లైన సీసీటీఎన్ఎస్ (CCTNS), ఈ-ఫోరెన్సిక్స్, ఈ-ప్రాసిక్యూషన్, ఈ-ప్రిజన్స్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభకు తెలిపారు. ఈ మౌలిక సదుపాయాల కల్పన, ఆధునీకరణ కోసం ప్రభుత్వం రూ. 1771.64 కోట్ల నిధులను కేటాయించిందని ఆయన ఒక రాతపూర్వక సమాధానంలో వివరించారు.

ఈ ఆధునీకరణలో భాగంగా విచారణ ప్రక్రియను సులభతరం చేసేందుకు సరికొత్త డిజిటల్ వేదికలను అందుబాటులోకి తెచ్చారు. నేర స్థలం నుంచి సాక్ష్యాల సేకరణను డిజిటల్ రూపంలో రికార్డ్ చేసేందుకు 'ఈ-సాక్ష్య' (e-Sakshya), కోర్టు నోటీసులను డిజిటల్ పద్ధతిలో జారీ చేసేందుకు 'ఈ-సమన్స్' (e-Summons), వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుల్లో సాక్ష్యాలను నమోదు చేసేందుకు 'న్యాయ శ్రుతి' (Nyaya Shruti) వంటి వ్యవస్థలను ప్రవేశపెట్టారు. వీటితో పాటు మెడికో-లీగల్ రిపోర్టులు (MLRs), పోస్ట్‌మార్టం రిపోర్టులను (PMRs) డిజిటలైజ్ చేసేందుకు 'మెడ్-లీపర్' (MedLeaPR) అనే పోర్టల్‌ను కూడా అభివృద్ధి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

Next Story