ప‌రిస్థితులు ఏ మాత్రం చేయిదాటినా ఆ బాధ్యత క‌ల్వకుంట్ల కుటుంబానిదే: ఎమ్మెల్సీ బ‌ల్మూర్ వెంక‌ట్

by Malleboina Mahesh |

కేసీఆర్‌ను సిట్ విచార‌ణ స‌మ‌యంలో నిర‌స‌న‌కు ఎందుకు బీఆర్ఎస్ పిలుపు నిచ్చింది? కేసీఆర్ ఏమైనా దైవాంశ సంభూతుడా? ఆయ‌న‌ను విచారించ‌కూడ‌దా? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బ‌ల్మూర్ వెంక‌ట్ ప్రశ్నించారు.

ప‌రిస్థితులు ఏ మాత్రం చేయిదాటినా ఆ బాధ్యత క‌ల్వకుంట్ల కుటుంబానిదే: ఎమ్మెల్సీ బ‌ల్మూర్ వెంక‌ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్‌ను సిట్ విచార‌ణ స‌మ‌యంలో నిర‌స‌న‌కు ఎందుకు బీఆర్ఎస్ పిలుపు నిచ్చింది? కేసీఆర్ ఏమైనా దైవాంశ సంభూతుడా? ఆయ‌న‌ను విచారించ‌కూడ‌దా? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బ‌ల్మూర్ వెంక‌ట్ ప్రశ్నించారు. కేసీఆర్‌ను విచారించ‌కూడ‌ద‌న్న తీరులో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ కేసులో అన్నీ వేళ్లు కేసీఆర్ వైపే చూపిస్తున్నాయని ఈ సందర్భంగా బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌లో అత్యధికంగా ల‌బ్ది పొందింది కేసీఆరే అని అర్థమౌతోంది. అందుకే ఆయ‌న‌ను సిట్ విచారిస్తోంది. సిట్ ఏం అడుగుతుందో తెలియ‌కుండానే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ హ‌డావుడి చేస్తోందని బల్మూర్ వెంకట్ ధ్వజమెత్తారు. తెలంగాణ భ‌వ‌న్ కు భారీ ఎత్తున కార్యక‌ర్తలు రావాల‌ని పిలుపునివ్వడం వెనుక కుట్ర క‌నిపిస్తోంది.. విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తామంటూనే ఆందోళ‌న‌ల‌కు పిలుపు నివ్వడం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.

విచార‌ణ స‌మ‌యంలో ఉద్దేశ‌పూర్వకంగా శాంతిభ‌ద్రత‌ల‌కు భంగం క‌ల్గిస్తార‌న్న అనుమానం మాకు క‌ల్గుతోంది..హ‌రీష్ రావు, కేటీఆర్ విచార‌ణ స‌మ‌యంలో కూడా జూబ్లీహిల్స్ స్టేష‌న్ ద‌గ్గర అల్లర్లు సృష్టించ‌డానికి ప్రయ‌త్నాలు జ‌రిగాయని బల్మూర్ వెంకట్ ఆరోపించారు. సిట్ విచార‌ణ‌ను భూత‌ద్దంలో చూపించి భ‌యాందోళ‌న‌లు క‌ల్పించ‌డానికి బీఆర్ఎస్ ప్రయ‌త్నాలు చేస్తోంది..వీటిని అడ్డుకోవాల్సిన బాధ్యత మా ప్రజా ప్రభుత్వానికి ఉంది.. బీఆర్ఎస్ తీరుపైన‌ క‌న్నేసి ఉంచాల‌ని ప్రభుత్వాన్ని, పోలీస్ అధికారుల‌ను కోరుతున్నట్లుగా ఆయన తెలిపారు. ప‌రిస్థితులు ఏ మాత్రం చేయిదాటినా దానికి బాధ్యత క‌ల్వకుంట్ల కుటుంబానిదే అని బల్మూర్ వెంకట్ తెలిపారు.

Next Story