‘దిశ’ కథనానికి స్పందన.. ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-29 07:11:27  IST  )

ఈనెల 27న ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో మౌలిక వసతులు అరకొర అనే ‘దిశ’ వెబ్‌సైట్ వార్తకు స్పందించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో నీటి వసతి పై ఆరా తీశారు.

‘దిశ’ కథనానికి స్పందన.. ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
X

దిశ, బయ్యారం: ఈనెల 27న ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో మౌలిక వసతులు అరకొర అనే ‘దిశ’ వెబ్‌సైట్ వార్తకు స్పందించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో నీటి వసతి పై ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే తరగతి గదులను టాయిలెట్లను పరిశీలించారు. టాయిలెట్ లో నీరు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో బోధన తెలుగు పాఠ్య పుస్తకంలోని తెలుగు తల్లి విగ్రహాన్ని చూపించి ఏమిటని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ జాతీయ గీతం తెలుసా అని ప్రశ్నించి విద్యార్థులతో గీతాన్ని ఆలపింపజేశారు.

తరగతిలో విద్యార్థులు నీటి కొరత ఉన్నదా అని ప్రశ్నించి ఎంతో నీటి కొరత ఉన్నదని తెలపడంతో అక్కడే ఉన్న అధికారులను నీటి కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. అనారోగ్యంతో ఉన్న పిల్లలను పలకరించి వైద్య సేవలు అడిగి ఆరా తీశారు. సిబ్బంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు ఎమ్మెల్యే అందించారు. ప్రిన్సిపాల్ ధనరాజ్‌తో మాట్లాడుతూ.. నీటి వసతులు ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించి తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. నీటి కొరత ఉన్నట్లు నా దృష్టికి వస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అదే విధంగా గ్రామ సర్పంచ్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి హాస్టల్ లో నీటి కొరత లేకుండా తగు చర్యలు తీసుకునే విధంగా సహకరించాలని ఎమ్మెల్యే వారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రమేష్, ఏకలవ్య పాఠశాల ఆర్ సి దీప, సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, కొత్తపేట సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ ,సిఐ రవీందర్ ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story