- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యుద్ధం పేరు చెప్పి ధరలు పెంచడం సరికాదు : ఎమ్మెల్యే కూనంనేని
ఇతర దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయనే పేరుతో భారతదేశంలో ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు.

దిశ, లక్ష్మీదేవిపల్లి : ఇతర దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయనే పేరుతో భారతదేశంలో ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. యుద్ధం పేరుతో పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా మాట్లాడుతూ అంబానీ, అదానీ కంపెనీలను లాభాల్లో నడిపించేందుకు, కార్పొరేట్ సంస్థలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోందని, అందులో భాగంగానే ధరల పెంపు చేపట్టిందని ఆరోపించారు. 2014తో పోల్చితే ప్రస్తుతం ఉన్న ధరల వ్యత్యాసాన్ని పరిశీలిస్తే ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తోందో అర్థమవుతుందని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను కూడా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.






