మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు

by Batti.Sumithra |

వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మానవత్వం చాటుకున్నారు.

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మానవత్వం చాటుకున్నారు. గురువారం వర్ధన్నపేట నుంచి మడికొండకు వస్తుండగా ఉర్సు మైదానం వద్ద రోడ్డు ప్రమాదం జరిగి క్షతగాత్రులు కనిపించారు. వెంటనే కారు దిగి క్షతగాత్రుడిని పరిశీలించి వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. తీవ్ర రక్తస్రావం కావడంతో తన వాహనంలో ఉన్న ప్రథమ చికిత్స కిట్ తో సహాయపడ్డారు. అంబులెన్స్‌ రాగానే గాయాలైనా యువకుడిని అంబులెన్స్‌ ఎక్కించి త్వరతిగతిన హాస్పిటల్ కు తరలించారు.

Next Story