Komatireddy Rajagopal Reddy: సస్పెన్స్‌కు తెర.. పార్టీ మార్పుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి క్లారిటీ

by Disha Web Desk 2 |
Congress MLA Komatireddy Rajagopal Reddy Gives Clarity Over Party Change
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: Congress MLA Komatireddy Rajagopal Reddy Gives Clarity Over Party Change| ఇన్నాళ్లు పార్టీ మార్పు క్లారిటీ ఇవ్వని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఒక్కసారిగా షాకింగ్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతానంటూ స్వయంగా రాజగోపాల్ రెడ్డి పలుమార్లు మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. కానీ, తాజాగా కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచన లేదంటూ ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మునుగోడు ప్రజలు, పార్టీ కేడర్‌ను ఒప్పించి మాత్రమే ముందడుగు వేస్తానని ప్రకటించారు. కేసీఆర్‌ను గద్దె దించే విషయంలో మాత్రమే నా నిర్ణయం ఉంటుందని, అంతేకానీ, స్వార్థం కోసమో, డబ్బు కోసమో నా త్యాగం ఉండబోదని స్పష్టం చేశారు. నేను తీసుకునే నిర్ణయం మునుగోడు ప్రజల మేలు కోరుకునేదై ఉండాలని తెలిపారు. అధికారంలో లేకపోవడంతో అభివృద్ధి చేయలేకపోతున్నాని, ఎంతో నమ్మకంతో, ప్రేమతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేక పోతున్నాని ఆవేదన వ్యక్తంచేశారు.



Next Story