- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీతారామచంద్రస్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే జీఎంఆర్
రామచంద్రాపురం డివిజన్‌లోని కాకతీయ నగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం నిర్వహించిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

దిశ, రామచంద్రాపురం : రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం వైభవంగా నిర్వహించిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి కృపాకటాక్షాలతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, జీవించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సత్సంబంధాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్, రాజు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






