స్విగ్గీ బాయ్ అవతారం ఎత్తిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్

by Muthe.Rajitha |

టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్విగ్గీ బాయ్ అవతారం ఎత్తారు.

స్విగ్గీ బాయ్ అవతారం ఎత్తిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్
X

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్విగ్గీ బాయ్ అవతారం ఎత్తారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒక వినూత్నమైన ప్రయత్నం చేశారు. తన నియోజకవర్గంలోని స్విగ్గీ, జొమాటో, ఇన్‌స్టామార్ట్ వంటి ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన స్వయంగా స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారారు. బుధవారం సాయంత్రం స్విగ్గీ ఇన్స్టామార్ట్ కు చెందిన ఆర్డర్లు తీసుకుని, హెల్మెట్, బ్యాగ్, బైక్‌తో డెలివరీ బాయ్ గెటప్‌లో ఇంటింటికీ వెళ్లి పార్సిల్స్ అందజేశారు. అయితే పార్సిల్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే అని తెలిసి ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన వైరల్ అయింది.

గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా తక్కువ వేతనాలు, భీమా లేకపోవడం, రోడ్డు ప్రమాదాల భయం, వర్షం, చలి, ఎండలో పడే కష్టాలు స్వయంగా అనుభవించి తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం చేశానని బోడె ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ప్రేరణ తీసుకుని ప్రజల మధ్యే ఉండాలనే ఉద్దేశంతో చేసిన ఒకరోజు సామాజిక ప్రయోగమని అన్నారు. భవిష్యత్తులో గిగ్ వర్కర్లకు ఉపయోగపడే విధానాలు రూపొందించేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుందని బోడె ప్రసాద్ పేర్కొన్నారు.

Next Story