- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ పట్టణంలోని 5, 6, 15, 16, 34, 47 వార్డుల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

దిశ, మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడ పట్టణంలోని 5, 6, 15, 16, 34, 47 వార్డుల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల మార్పులు, దరఖాస్తుల స్వీకరణ తదితర ప్రక్రియలను పరిశీలించి ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఓటరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను నమోదు చేసుకోవడం లేదా సవరించుకోవడానికి అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పనిచేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, 15వ వార్డు ఇన్‌చార్జి మంత్రాల రుణాల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్కే శ్రీజ, అశోక్, స్వప్న, పుట్టపాక శ్రీనివాస్, ఎన్నికల అధికారులు, బూత్ లెవల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






