ఎన్నిలకు ఇంకా మూడేళ్లు ఉంది.. ఆలోపు ఏదైనా జరగొచ్చు: MLA షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-31 11:15:08  IST  )

మున్సిపల్ ఎన్నికల వేళ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నిలకు ఇంకా మూడేళ్లు ఉంది.. ఆలోపు ఏదైనా జరగొచ్చు: MLA షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల వేళ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(Bandla Krishna Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించడానికి చాలామంది నా అనుచరులు, అభిమానులు, మేలు కోరుకునే వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఇప్పుడు వారంతా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.. వారి కోసం నేను తప్పకుండా ప్రచారం చేస్తా.. గెలిపించుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తాను.. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం వారే అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రజలు కూడా ఆ పార్టీవైనే ఉంటారు.. అధికార పార్టీకి ఓటేస్తేనే ఉపయోగం అని నేనూ నమ్ముతానని అన్నారు. ఎవరేం అనుకున్నా గద్వాల నియోజకవర్గ నా అభివృద్ధే నా ధ్యేయమని చెప్పారు.

ఆలోపు ఏదైనా జరుగొచ్చు

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉంది.. ఆలోపు ఏదైనా జరుగొచ్చు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను పట్టించుకోను.. నేను ఏ పార్టీలో ఉన్నానో చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణ మోహన్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలో పాల్గొనడం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ అభ్యర్థుల ర్యాలీలో పాల్గొనడమే కాకుండా వారిని గెలిపించాలంటూ కోరారు.

Next Story