సంగారెడ్డి లో యువతి అదృశ్యం

by Disha Web Desk 12 |
సంగారెడ్డి లో యువతి అదృశ్యం
X

దిశ, కంది: కూలి పని చేసుకునే యువతి సంగారెడ్డి లో అదృశ్యమైన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. మునిపల్లి గ్రామానికి చెందిన చిత్తారి సిద్దయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి గత కొంత కాలంగా సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి లో నివాసం ఉంటున్నారు. అయితే వీరి కుటుంబ సభ్యులు స్థానికంగా కూలిపని చేసుకుని జీవిస్తున్నారు.

అతని కూతురయిన చిత్తారి అనసుజ (17) ఈనెల 4వ తేదీ 7:00 సమయంలో కిరాణా షాప్ కి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఈ మేరకు యువతి అన్న రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి ఆచూకీ తెలిసినవారు 9490617033 కు సమాచారం అందించాలని ఎస్ఐ సూచించారు.



Next Story

Most Viewed